NTR: విస్సన్నపేట పోలీస్ స్టేషన్‌ను సీఐ గురుప్రకాశ్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన సీఐ, స్టేషన్ సిబ్బందితో మాట్లాడారు. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారం, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీఐ


