CTR: బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుండ్లకట్టమంచి గ్రామం వద్ద జాతీయ రహదారిపై పొలం నుంచి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిల్చున్న వెంకటేశ్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి


