హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ కింద నిద్రిస్తున్న డ్రైవర్ మృతి

TPT: తడ మండలం మాంబట్టు సెజ్‌లోని ఈ-ప్యాక్ కంపెనీ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపిన లారీ కింద నిద్రిస్తున్న డ్రైవర్ రాజీవ్ గాంధీపై మరో లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీ సమీపంలో భారీ వాహనాల పార్కింగ్‌ను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.