హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పుంగనూరులో TDP కార్యాలయం ప్రారంభం

CTR: పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఇటీవల నియమితులైన మధుసూదన్ నాయుడు ఆదివారం పుంగనూరులో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు కుర్రపల్లిలోని మసమ్మ అమ్మవారి ఆలయం, సూటూరు గంగమ్మ, శ్రీ కల్యాణ వెంకటరమణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం దర్గాలో ప్రార్థనలు చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు నాయకులు తెలిపారు.