అన్నమయ్య: రాయచోటి ఎస్‌ఎన్ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు రూ.23 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్


