హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో SIR ప్రత్యేక ప్రచార దినాలు

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో SIR-2026 సందర్భంగా ప్రత్యేక ప్రచార దినకార్య క్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎల్వోలు పోలింగ్ బూత్ల వద్ద అందుబాటులో ఉండి నూతన ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులతో పాటు SIRకు సంబంధించిన క్లెయిమ్ అప్లికేషన్లను స్వీకరించారు. ఓటర్లకు దరఖాస్తులపై అవసరమైన సూచనలు, వివరాలను అందించారు.