VKB: కొడంగల్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ సభలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ప్రతిపక్షాలు ‘గుంపు మేస్త్రీ’ అని ఎగతాళి చేస్తున్నాయన్నారు. తాను నిజంగానే గుంపు మేస్త్రీనేనని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ఉపాధ్యాయుల గుంపునకు తానే మేస్త్రీ అని పేర్కొన్నారు. టీచర్లే తన గుంపు, కుటుంబమని, వారి బోధన వల్లనే తాను ఈ స్థాయికి వచ్చానని వెల్లడించారు.
తెలంగాణ
నేను నిజంగా గుంపు మేస్త్రీనే: రేవంత్


