హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీని వీడి టీడీపీలో చేరిన 60 కుటుంబాలు

VZM: గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస గ్రామానికి చెందిన 60 కుటుంబాలు సభ్యులతో కలిసి శనివారం విజయనగరంలోని మంత్రి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.