హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి'

AKP: స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ శ్రేణులకు సూచించారు. శనివారం చోడవరంలో జరిగిన వైసీపీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యర్థులు తప్పక పోటీ చేయాలని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. సర్పంచ్ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతోందని విమర్శించారు.