KDP: తాడిపత్రి నుంచి కడపకు వస్తున్న బస్సులో మహిళ మెడలోని బంగారు తాళిబొట్టు చోరీకి గురైంది. ముద్దనూరు మండలం మంగపట్నానికి చెందిన శ్యామలాదేవి శనివారం బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా తాడిపత్రి బస్టాండ్‌లో కడప బస్సు ఎక్కే సమయంలో గుర్తుతెలియని మహిళలు ఆమె మెడలోని బంగారు తాళిబొట్టును అపహరించారు. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
బస్సులో బంగారు తాళిబొట్టు చోరీ


