హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం'

W.G: సమాజంలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. శనివారం నరసాపురంలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందని చెప్పారు. విద్యార్థులందరూ గురువుల మాటలు శ్రద్ధగా ఆలకించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన పిలుపునిచ్చారు.