హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొలుసు మద్యం దుకాణాలపై దాడులు

KDP: అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ అధికారులు కొరడా ఝుళిపించారు. అట్లూరు, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల్లో గత 4 రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం విక్రయిస్తున్న గొలుసు దుకాణాలపై దాడులు చేసి 22 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తూ పట్టుబడిన వెంకటయ్య, నాగిరెడ్డి, భాగ్యమ్మ, సహదేవ్‌లపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ CI రాజశేఖర్ తెలిపారు.