W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామ చింతరేవు కాలువలో 30 నుంచి 35 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాలువలో పడి సుమారు వారం రోజులు కావడంతో శవం బాగా ఉబ్బిపోయింది. కుడి చేతిపై 'K లక్ష్మి', ఎడమ చేతిపై నాగపాము పచ్చబొట్లు ఉన్నాయి. ఈ ఆనవాళ్లతో మృతుడిని గుర్తించిన వారు వెంటనే మొగల్తూరు ఎస్ఐని సంప్రదించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


