హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో లష్కరే కమాండర్ హతం

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబా కమాండర్‌ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. కొంతకాలంగా ఉగ్రవాది యాసిర్ కదలికలపై నిఘా పెట్టిన భద్రతాబలగాలు యూస్‌మార్గ్‌లో అతడిని గుర్తించాయి. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో యాసిర్ హతమైనట్లు అధికారులు ప్రకటించారు. యాసిర్ గతంలో లష్కరే తయ్యిబాకు చెందిన ఓ ఉగ్రముఠాలో సభ్యుడిగా ఉండేవాడని కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు.