హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సేవా కార్యక్రమాలను అభినందించిన సీపీ

విశాఖ శ్రీ స్వామి వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ముగిశాయి. మూడో రోజు శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు శంకర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర పోలీస్‌ కమిషనర్‌ శంకబ్రత బాగ్చీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.