ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలోని ఆటో స్టాండ్ ప్రాంతంలో శనివారం 1.5 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్సై శ్రీహరిరావు కథనం ప్రకారం.. గంజాయి రవాణా జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా ఒడిస్సాకు చెందిన సింహాద్రి రావు అనే వ్యక్తి వద్ద గంజాయి పట్టుబడిందని చెప్పారు. దాని విలువ రూ.85 వేలు ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
రైల్వే స్టేషన్ ప్రాంతంలో కేజీల గంజాయి పట్టివేత


