హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆయిల్ బాల్స్‌తో దోమల లార్వా నివారణకు చర్యలు

కృష్ణా: మచిలీపట్నం కలెక్టర్ బంగ్లా పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ పర్యవేక్షణలో నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాలను గుర్తించి, దోమల లార్వా పెరుగుదలను నివారించేందుకు ఆయిల్ బాల్స్‌ను సిద్ధం చేసి నీటిలో వేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు హెల్త్ సూరిబాబు, రాఘవేంద్ర పాల్గొన్నారు.