హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక చవితి నిబంధనలు పాటించాలి'

PLD: ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వినాయక చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని దాచేపల్లి సీఐ షేక్ ఖాజావలి కోరారు. శనివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడిన ఆయన, http://ganeshutsav.net పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.