హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డీజేలపై నిషేధం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు'

SRPT: హుజూర్ నగర్ మండలంలో, పరిసర ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలకైనా డీజే సౌండ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని హుజూర్ నగర్ ఎస్సై నరేష్ స్పష్టం చేశారు. ఈరోజు ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.