హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దాచేపల్లిలో రైల్వే డబ్లింగ్ భూసేకరణ పూర్తి

PLD: గుంటూరు-బీబీనగర్ రైల్వే డబ్లింగ్ పనులకుగానూ దాచేపల్లి మండలంలో భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని తహసీల్దార్ జీ.శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం రైల్వే అధికారులతో నిర్వహించిన సమీక్షలో నడికుడి, రామాపురం, కేసానుపల్లి, పొందుగుల పరిధిలో సేకరించిన భూముల వివరాలను వెల్లడించారు. ఈ భూమిని త్వరలోనే రైల్వే శాఖకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.