హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై లెక్క చెప్పాలి'

BHPL: BRS పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీల అమలుపై ఆ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని గోరికొత్తపల్లి (M) కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఓంప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, రుణమాఫీ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు BRS తమ పదేళ్ల పాలనకు లెక్క చెప్పాలని అన్నారు.