హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇన్సూరెన్స్ పై ప్రజలకు అవగాహన

NGKL: తపాలా శాఖలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని పోస్ట్ ఆఫీసర్ పుష్పిగిరిరావు తెలిపారు. శనివారం వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణ తపాలా జీవిత బీమాపై ప్రజలకు అవగాహన కల్పించారు. 19 నుండి 55 సంవత్సరాల వయసు గలవారు ఈ బీమాకు అర్హులని, రూ.10 వేల నుండి రూ.10 లక్షల వరకు బీమా పొందే అవకాశం ఉందని ఆయన వివరించారు.