NGKL: అచ్చంపేట పట్టణంలోని పలు బేకరీల్లో శనివారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, పాడైపోయిన క్రీమ్‌లు, నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లను గుర్తించి నిర్వాహకులకు జరిమానాలు విధించారు. బేకరీ యజమానులు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని, నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయించరాదని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ
బేకరీలపై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు


