హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మీకోసం'లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

BPT: చుండూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన 'మీకోసం' కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.