హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినులకు మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన

హన్మకొండ నగరంలో విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాలు, టీ-సేఫ్ యాప్‌పై షీ టీమ్ ఎస్సై రామారావు శనివారం అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా ప్రయాణించే మహిళలు టీ-సేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని, అనుచిత ప్రవర్తన ఎదురైతే షీ టీమ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.