హన్మకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాల పిల్లల మధ్య ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి, నాయిని నీలిమ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఉపాధ్యాయులను సన్మానించి, పిల్లలకు పుస్తకాలు, స్టేషనరీ, మిఠాయిలు అందించారు. గురువులు సమాజానికి దిశానిర్దేశకులని కొనియాడారు.
తెలంగాణ
ఉపాధ్యాయులకు సన్మానం.. పిల్లలకు పుస్తకాల పంపిణీ


