హైదరాబాద్: 28°C
తెలంగాణ

కైలాస యాత్ర అనంతరం వరంగల్ వాసి గల్లంతు

WGL: మామునూరుకు చెందిన రేగూరి వినయ్‌కుమార్‌రెడ్డి (44) నేపాల్‌లో వరదల్లో గల్లంతయ్యారు. కైలాస యాత్ర ముగించుకుని ఆగస్టు 26న తిరిగి వస్తుండగా రసువా ప్రాంతంలో భారీ బురద వరద దూసుకురావడంతో గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కెనడాలో స్థిరపడిన వినయ్‌కుమార్ ఆచూకీ కోసం నేపాల్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.తిరిగి వస్తారన్న ఆశతో కుటుంబసభ్యులు ఎదురుచూపు.