హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని వినతి

WGL: చెన్నారావుపేట్ శివాలయ ప్రాంగణంలో చేపడుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ గ్రామస్థులు శనివారం కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. గ్రామస్థుల సహకారంతో నిర్మించిన ఆలయ ప్రాంగణంలో అనుమతులు లేకుండా కొంతమంది నిర్మాణ పనులు చేపడుతున్నారని వారు ఆరోపించారు. వయోవృద్ధుల సంక్షేమం పేరుతో ఆలయంలోని రేకుల షెడ్డులో ఉంటూ సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టారని తెలిపారు.