ASR: జీకేవీధి మండలం డోకులూరు ఘాట్ రోడ్‌లో ప్రమాదానికి గురైన గిరిజన మహిళలు కోలుకుంటున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 22 మంది గాయపడగా వారిని మొదట పెదవలస అక్కడ నుంచి చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన ఏడుగురిలో ఇద్దరిని నర్సీపట్నం, ఐదుగురిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలు కోలుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
కోలుకుంటున్న డోకులూరు ప్రమాద బాధితులు


