హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీమకుర్తిలో రెచ్చిపోయిన దొంగలు

ప్రకాశం: చీమకుర్తి (మం) రామచంద్రాపురంలో శనివారం దొంగలు రెచ్చిపోయారు. శ్రీను అనే వ్యక్తికి చెందిన నివాసంలో దొంగలు చొరబడి రూ.80 వేలు నగదు, మూడు గ్రాముల బంగారాన్ని దొంగలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధితుడు వివాహానికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.