హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగునీరు అందక మురుగునీటితో ( VIDEO)

కృష్ణా: పెడనలో వర్షాలు లేక, కాలువలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు గత్యంతరం లేక కాలువలోని మురుగునీటినే ట్రాక్టర్ మోటార్ల సహాయంతో పొలాల్లోకి మళ్లిస్తూ అందిస్తున్నారు. స్వచ్ఛమైన సాగునీరు అందక మురుగునీటినే ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.