హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'

SKLM: ఎమ్మెల్యే శంకర్ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా శనివారం తన క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే, సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.