WGL: పర్వతగిరి మండలం ఏనుగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవం, స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు జి. లింగారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులర్పించారు. అనంతరం పదో తరగతి విద్యార్థి బి. కళ్యాణ్ ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టి స్వయం పరిపాలన నిర్వహించారు.
తెలంగాణ
రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ


