హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్ TRP ఉపాధ్యక్షుడిగా రాధాకృష్ణ

RR: తెలంగాణ రాజ్యాధికార పార్టీ షాద్‌నగర్ ఉపాధ్యక్షుడిగా కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన మీదికేరి రాధాకృష్ణ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆశయాల సాధనకు కృషి చేస్తానని రాధాకృష్ణ తెలిపారు.