KMR: పిట్లం వైశ్య భవన్‌లో బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, ఎస్సై అంజనేయులు ఆధ్వర్యంలో వినాయక చవితి శాంతి సమావేశం శనివారం నిర్వహించారు. ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని అధికారులతో పాటు సర్పంచ్ శేఖర్, ప్రజాప్రతినిధులు సూచించారు. మండపాల ఏర్పాటు, సౌండ్ సిస్టమ్, ఊరేగింపు నిమజ్జనాల్లో పోలీసు నిబంధనలు పాటించాలని, సమస్యలు ఉంటే వెంటనే తెలపాలని కోరారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి: CI


