హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

GDWL: ఆపదలో ఉన్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక గొప్ప వరమని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శనివారం గద్వాల క్యాంప్ కార్యాలయంలో వివిధ వార్డులకు చెందిన 24 మంది లబ్ధిదారులకు రూ. 8,27,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి కొండంత అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.