WNP: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని సదరం విభాగం సమీపంలో మ్యాన్‌హోల్ మూత ధ్వంసమై నాలుగు అడుగుల లోతైన రంధ్రం ఏర్పడింది. ఆసుపత్రికి వచ్చే రోగులు, వృద్ధులు, చిన్నారులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మూత అమర్చాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదకరంగా మ్యాన్‌హోల్


