హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలను కలిసి వేసిన దృశ్యం

వరంగల్‌ ఎమ్మార్వో కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ ఓటు అప్లికేషన్‌ క్లియరెన్స్‌ కోసం ఓ తల్లి పసికందుతో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. బిడ్డ ఆకలితో ఏడవడంతో తండ్రి కార్యాలయం ముందు టేబుల్‌పై పడుకోబెట్టి పాలసీసాతో పాలు పట్టించాడు. ఈ దృశ్యం పలువురిని కలచివేసింది. సామాన్యులకు ప్రభుత్వ కార్యాలయాల్లో వేగంగా, సౌకర్యవంతమైన సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.