హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పద్మాక్షి కోనేరులో పేరుకుపోయిన గుర్రపు డెక్క

హన్మకొండ నగరంలోని ప్రముఖ పద్మాక్షి గుండం కోనేరులో గుర్రపు డెక్క, వ్యర్థాలు పేరుకుపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని భక్తులు, కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు కనిపించకుండా గుర్రపు డెక్క విస్తరించిందని తెలిపారు. అధికారులు స్పందించి కోనేరును వెంటనే శుభ్రం చేయాలని కోరుతున్నారు.