హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఛలో హైదరాబాద్ మహా ధర్నాను విజయవంతం చేయాలి'

WGL: ఈ నెల 10న నిర్వహించనున్న ‘ఛలో హైదరాబాద్ మహా ధర్నా’ను విజయవంతం చేయాలని GWMC జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) పిలుపునిచ్చింది. మున్సిపల్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పాల్గొనాలని జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు బొట్ల రమేష్, రాజరపు భాస్కర్ కోరారు. ఉద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ధర్నాకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.