NLG: చిట్యాలలో బీజేపీ ఫ్లెక్సీల తొలగింపుపై మున్సిపల్ కమిషనర్‌కు ఆ పార్టీ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. అధికార పార్టీ నేతల అండతోనే అధికారులు ఫ్లెక్సీలు తొలగించారని పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ మండిపడ్డారు. మరోసారి ఇలా చేస్తే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుంచు శ్రీను, కూరెళ్ళ శ్రీను, గోవర్ధన్, రామకృష్ణ పాల్గొన్నారు.
తెలంగాణ
బీజేపీ ఫ్లెక్సీల తొలగింపు పై కమిషనర్‌కు వినతి


