హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు

BDK: మణుగూరు మండలం తిర్లపురం గ్రామం వద్ద శనివారం ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పినపాక మండలం జానంపేటకు చెందిన టాపి మేస్త్రీ కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.