హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీఈడీ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి'

KDP: జిల్లాలో అనుమతులు, గుర్తింపు, మౌలిక వసతులు లేకుండా బీఈడీ అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలలపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు CH.నర్సింహులు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కళాశాలల్లో అర్హత కలిగిన అధ్యాపకులు ఉన్నారో లేదో తనిఖీ చేయాలని కోరారు.