హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. కేశవరావు, అధ్యాపకులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గురువుల సేవలు అమూల్యమైనవని, విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని ప్రిన్సిపల్ పిలుపునిచ్చారు. విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.