WNP మండలంలోని చందాపూర్, దత్తాయపల్లి, తాండాల గ్రామాల్లో కరువు పరిస్థితులను రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య రైతులతో కలిసి పరిశీలించారు. ఎండిపోయిన బోర్లు, ఎండిన పంట పొలాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువలకు వెంటనే మరమ్మతులు చేసి సాగునీరు అందించాలని, తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
రైతులను ఆదుకోవాలని డిమాండ్


