ప్రకాశం: కనిగిరి మండలం బల్లిపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎం.వీ.ఎస్. పార్వతి ఆధ్వర్యంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల సేవలు, త్యాగాలు మరువలేనివని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
బల్లిపల్లెలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం


