హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్దులపల్లి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

BHPL: మహాదేవపూర్ మండలం మద్దులపల్లి ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యారంగానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం విద్యార్థులకు ప్రభుత్వం అందించిన స్కూల్ డ్రెస్సులు, షూలను పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.