WNP: పట్టణంలోని గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు వనపర్తి పోలీస్ స్టేషన్‌లో జరిగే సమావేశానికి అన్ని మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు హాజరుకావాలని ఎస్సై కోరారు. ఉత్సవాల సందర్భంగా భద్రత, శాంతిభద్రతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసులు సూచనలు ఇవ్వనున్నారు.
తెలంగాణ
గణేష్ ఉత్సవాలపై పోలీసుల ఫోకస్: ఎస్సై


