హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాశక్తి ఆలయంలో కొప్పుల దంపతుల పూజలు

KNR: పవిత్ర శ్రావణ శనివారం సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా శనీశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామి, అమ్మవార్లను ఈ సందర్భంగా వారు వేడుకున్నారు.