హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

50 ఏళ్ల అనంతరం ఆచార్యుడికి సన్మానం

E.G:1972-74 సంవత్సరాల మధ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు తమ అర్థశాస్త్రం అధ్యాపకులు పి. రామారావు (95)ను ఘనంగా సత్కరించారు. శనివారం రాజమండ్రి రూరల్ కోలమూరులోని ఆయన స్వగృహంలో ఈ ఆత్మీయ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ధార్మిక కన్వీనర్ చాగంటి నరసింహారావు ఆధ్వర్యంలో ఇంటర్ క్లాస్ మేట్స్ తో కలిసి సన్మానించారు.